కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహసింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ ముఖ్య తారలుగా నటించిన విభిన్న కథాచిత్రం ది రెడ్ బ్యాగ్. రవికుమార్ సీరపు దర్శకుడు. హరికృష్ణ సోమిశెట్టి నిర్మాత.ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఏపీ మంత్రి టీజీ భరత్ టీజర్‌ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

లైఫ్ టైమ్ ఇంపాక్ట్ చూపించే సినిమా ది రెడ్ బ్యాగ్. ఈ సినిమా చూశాక ఎక్కడ రెడ్ బ్యాగ్ కనిపించినా, ది రెడ్ బ్యాగ్ సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమాకు కథే హీరో. ప్రేక్షకులు పెట్టే డబ్బుకు న్యాయం చేసేలా సినిమా ఉంటుంది అని దర్శకుడు రవికుమార్ సీరపు నమ్మకంగా చెప్పారు.

మూవీ చాలా బాగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. త్వరలోనే మూవీ రిలీజ్ కాబోతోంది అని నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి చెప్పారు. రాధ్య మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో హరి, రవి నాకు ఎంతో సపోర్ట్ చేసారు. మేం ఎంతో కష్టపడి చిత్రాన్ని ఫినిష్ చేశాం. మా టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: ప్రియేష్ గురుస్వామి, సంగీతం: శేఖర్ మోపురి, నిర్మాణం: మెమరీ మేకర్స్.





























