Namaste NRI

బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ రాజీనామా

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తన పదవికి రాజీనామా ప్రకటించారు. తన లేబర్‌ పార్టీ నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి తలొగ్గి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్టార్మర్‌ ప్రకటించారు. తాను తీసుకున్న ప్రతి నిర్ణయం తాను అమితంగా ప్రేమించే దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగానే ఉంటుందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని 63 ఏండ్ల స్టార్మర్‌ పేర్కొన్నారు. తద్వారా గత పదేండ్లలో తరచుగా నాయకులు మారుతున్న పరిణామ క్రమంలో పదవి నుంచి వైదొలుగుతున్న ఆరవ ప్రధానిగా ఆయన నిలిచారు. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని లేబర్‌ పార్టీ పాలక మండళ్లను కోరనున్నట్లు స్టార్మర్‌ తెలిపారు.

లేబర్‌ పార్టీలో తన నాయకత్వానికి ఉన్న మద్దతు తగ్గిపోయిందని తన రాజీనామా ప్రసంగంలో స్టార్మర్‌ అంగీకరించారు. వరుస వివాదాలు, విధానపరమైన నిర్ణయాల మార్పులు, ప్రజా మద్దతు తగ్గడం వంటి పరిణామాల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా స్టార్మర్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని బయటి నుంచే కాక లేబర్‌ పార్టీలోనుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

Social Share Spread Message

Latest News