Namaste NRI

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌ రిలీజ్‌ ఎప్పుడంటే!

ఈ నగరానికి ఏమైంది సినిమా విడుదలై ఎనిమిదేండ్లయింది. ఇప్పటికీ ఈ సినిమాకు అభిమానులున్నారు. ఇందులో విశ్వక్‌సేన్‌, అభినవ్‌ గోమటం, వెంకటేశ్‌ కాకుమాను చేసిన నవ్వుల హంగామాను తేలిగ్గా మరిచిపోలేం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ సిద్ధమవుతున్నది. ENE Repeat పేరుతో రూపొందుతున్న రీ యూనిన్‌లో శ్రీనాథ్‌ మాగంటి కూడా భాగం అయ్యారు. తరుణ్‌భాస్కర్‌ మరోసారి దర్శకత్వం వహిస్తున్నారు.

సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మాతలు. నవంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ గ్యాంగ్‌ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఫ్రెండ్షిప్‌ యాంథమ్‌ నేపథ్యంలో ఒక ఫీల్‌గుడ్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి కెమెరా: ఏజే ఆరోన్‌, సంగీతం: వివేక్‌ సాగర్‌, నిర్మాణం: ఎస్‌ ఒరిజినల్స్‌, రూట్‌నోడ్‌ సినిమా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events