Namaste NRI

మృత్యువును పసిగట్టే కాలిక్యులేటర్‌

మరణాన్ని ముందుగానే అంచనా వేసే సూపర్‌ హ్యూమన్‌ ఏఐ డెత్‌ కాలిక్యులేటర్‌ ను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సింగిల్‌ ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌ (ఈసీజీ) టెస్ట్‌ సాయంతో గుండె విద్యుత్తు కార్యకలాపా లను (ఎలక్ట్రికల్‌ యాక్టివిటీని) రికార్డు చేస్తుంది. తద్వారా వైద్యులు సైతం గుర్తించలేని రహస్య ఆరోగ్య సమస్యలను గుర్తించగలుగుతుంది. ఏఐ-ఈసీజీ రిస్క్‌ ఎస్టిమేషన్‌ లేదా ఏఐఆర్‌ఈ అని పిలిచే ఈ ప్రోగ్రామ్‌, 10 ఏండ్లలో సంభవించనున్న మరణాల ముప్పును ఈసీజీ పరీక్ష ద్వారా 78% కచ్చితత్వంతో గుర్తించగలుగుతు న్నట్టు పరిశోధనల్లో తేలింది. బ్రిటన్‌లోని హాస్పిటళ్లు ఈ డెత్‌ కాలిక్యులేటర్‌ను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events