కలర్‌ఫొటో సినిమాతో డైరెక్టర్‌గా మంచి ఫేం సంపాదించాడు సందీప్ రాజ్. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ డెబ్యూ సినిమాగా ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కలర్ ఫొటో. డైరెక్టర్‌గా, రైటర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న సందీప్ రాజ్ పర్సనల్ లైఫ్‌లో కీలక ముందడుగు వేయబోతు న్నాడు. సందీప్ రాజ్ క్లాసికల్ డ్యాన్సర్ చాందిని రావును పెండ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ సర్కిల్ టాక్. ఈ కపుల్ నవంబర్ 11న వైజాగ్‌లో నిశ్చితార్థం జరుపుకోనున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 7న తిరుపతిలో వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నట్టు ఇన్‌సైడ్ టాక్. అయితే వెడ్డింగ్ న్యూస్‌పై సందీప్ రాజ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.చాందినీ రావు కలర్‌ఫొటో, రణస్థలి, హెడ్ అండ్ టేల్స్‌తోపాటు పలు వెబ్ సిరీస్‌లలో నటించించింది. చాందిని రావు ప్రొడక్షన్ హౌస్‌ను కూడా మెయింటైన్ చేస్తుంది.