మైక్రోసాఫ్ట్ ఉద్యోగి స్టీవ్ బాల్మర్ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను దాటేశాడు. మైక్రోసాఫ్ట్‌లో మాజీ సీఈవోగా చేసిన బాల్మర్ ఇప్పుడు ప్రపంచంలో ఆరవ సంపన్నుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా మైక్రోసాఫ్ట్ షేర్లు కొత్త రికార్డులు సృష్టించాయి. ఆ షేర్ల విలువ సుమారు 21 శాతం పెరిగింది. ఓపెన్ఏఐ సంస్థతో ఇటీవల మైక్రోసాఫ్ట్ ఒప్పందం పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తోంది.
మైక్రోసాఫ్ట్ షేర్లలో బాల్మర్‌కు 90 శాతం వాటా ఉన్నది. మరో వైపు బిల్ గేట్స్ మాత్రం తన సంపదలో కొంత మొత్తాన్ని కాస్‌కేడ్ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. రిపబ్లిక్ సర్వీసెస్ కంపెనీలోనూ అతని కొంత వాటా ఉన్నది. అయితే ఇటీవల దానాలతోనూ బిల్ గేట్స్ తన సంపదను తగ్గించుకున్నారు. వ్యక్తిగత సంపద నుంచి బిల్ గేట్స్, తన ఫౌండేషన్ కోసం విరాళం ఇచ్చేశారు. సుమారు 60 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపదను ఆయన దానం చేశారు.