Namaste NRI

సీతారామపురంలో ఒక ప్రేమజంట  ప్రీ రిలీజ్‌ వేడుక

రణధీర్‌, నందినీ జంటగా ఎం.వినయ్‌ బాబు తెరకెక్కించిన చిత్రం సీతారామపురంలో ఒక ప్రేమ జంట. బీసు చందర్‌గౌడ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్‌, నిర్మాత రామసత్యనారాయణ, దర్శకులు వీఎన్‌ ఆదిత్య,  చంద్రమహేష్‌, వై.కాశీవిశ్వనాథ్‌ హాజరై, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.  చిత్ర దర్శకుడు ఎమ్‌. వినయ్‌ బాబు మాట్లాడుతూ మంచి కెంటెంట్‌తో పాటు వాణిజ్య అంశాలున్న చిత్రమిది. ప్రేక్షకులను మా సినిమా ఏ మాత్రం నిరుత్సాహ పరచదు అన్నారు. బీసు చందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో జరిగే విభిన్నమైన ప్రేమకథా చిత్రం  సీతారామపురంలో ఒక ప్రేమ జంట. ట్విస్ట్‌లు, అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. మా చిత్రాన్ని యువతరంతో పాటు తల్లితండ్రులు చూడాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రణధీర్‌, నందిని, నటుడు అమిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News