Namaste NRI

కమల్ హాసన్ పుట్టినరోజు కానుక‌గా ఇండియన్‌-2 నుంచి కొత్త పోస్ట‌ర్‌ను

కమల్ హాసన్ పుట్టినరోజు కానుక‌గా ఇండియన్‌-2 నుంచి ద‌ర్శ‌కుడు శంకర్‌ ఒక కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నారు. ఇండియన్ 2 షూటింగ్‌లో భాగంగా కమల్ హాసన్, శంక‌ర్ క‌లిసి దిగిన ఓ వర్కింగ్‌ స్టిల్‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు శంకర్‌. ఇక ఈ పోస్ట‌ర్‌లో కమల్‌.. భారతీయుడు లుక్‌లో ఆకట్టుకునేలా కనిపించారు. భారతీయుడుని తిరిగి తీసుకురావడానికి మీతో మళ్లీ పని చేసే అవకాశం రావడం అద్భుతం. మీరు మమ్మల్ని అలరిస్తూనే ఉంటారని, మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను అంటూ శంక‌ర్ ఈ పోస్ట‌ర్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ సినిమాను రెడ్ జెయింట్‌, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events