భారత సంతతికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ వెంకీ రామకృష్ణన్‌కు ఇంగ్లండ్‌లో ప్రతిష్ఠాత్మక రాయల్ ఆర్దర్ ఆఫ్ మెరిట్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ పురస్కారం పొందిన ఆరుగురిలో 70 ఏళ్ల వెంకీ రామకృష్ణన్ ఒకరు. సైన్యం, సైన్స్, కళలు, సాహిత్యం, సంస్కృతి తదితర అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్ రాజకుటుంబం ఈ పురస్కారాలను ప్రధానం చేస్తుంది. ఈ పురస్కారాన్ని ఆయనకు బ్రిటన్ రాజు చార్లెస్`3 అందజేశారు. తమిళనాడులోని చిదంబరంలో జన్మించిన వెంకీ రామకృష్ణన్ అమెరికాలో బయాలజీ విభాగంలో చదువు పూర్తి చేశారు. యూకేకు మకాం మార్చారు. రైబొసోమల్ నిర్మాణంపై పరిశోధనలకు గాను 2009లో ఆయనకు నోబెల్ బహుమతి వరించింది. 2012లో బ్రిటన్ రాణి నుంచి నైట్‌హుడ్ పురస్కారం అందుకున్నారు. 2015 నుంచి 2020 వరకు ఆయన యూకే సొసైటీకి అధ్యక్షుడిగా సేవలందించారు.
