వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ తన నటన, అందంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఏమాయ చేశావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. అంతేకాకుండా అత్యధిక పారితోషికం అందుకుంటున్న సౌత్ కథానాయికలలో కూడా సమంత ముందు వరుసలో ఉంది. అయితే, ప్రస్తుతం అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Mayfair-119.jpg)
ఈ క్రమంలో తాజాగా సామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. వుమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును గెలుసుకుంది. సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోం ది. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటులు హాజరై సందడి చేశారు. ఈవెంట్‌లో భాగంగా రెండో రోజు స్టార్ నటులు సమంత, రానా, వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకల్లోనే సామ్‌ను నిర్వాహకులు ప్రతిష్ఠాత్మక వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Ixora-118.png)