Namaste NRI

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అరుదైన ఘటన .. సెనేటర్‌గా భగవద్గీతపై ప్రమాణం చేసిన భారత సంతతి నేత

భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్‌ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి సెనేటర్ అయ్యారు. అంతేకాదు పార్లమెంట్ సాక్షిగా హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేశారు. లేబర్ పార్టీకి చెందిన ఈ సెనేట్ సీటు గత నెల ఖాళీ అయింది. అంతవరకు ఈ సీటులో సెనేటర్‌గా ఉన్న పాట్రిక్ డోడ్సన్ అనారోగ్య కారణాల వల్ల రిటైర్ కావడంతో అప్పటి నుంచి సెనేటర్ స్థానం ఖాళీగా ఉంది. ఈ సెనేటర్ పదవికి 38 ఏళ్ల వరుణ్‌ఘోష్ కు లేబర్ పార్టీ ఎంపిక చేసింది. ఘోష్ తల్లిదండ్రులు 1980లో భారత్ నుంచి ఆస్ట్రేలియాలో డాక్టర్లగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 17 ఏళ్ల వయసులో ఘోష్ పెర్త్‌లో లేబర్ పార్టీలో చేరారు. ఫ్రాన్సిస్ బర్ట్ చాంబర్స్‌లో బారిస్టర్ అయ్యారు. కమర్షియల్, అడ్మినిస్ట్రేటివ్ లా చేశారు. ఇండస్ట్రియల్ రిలేష న్స్, ఎంప్లాయ్‌మెంట్ లా కూడా చేశారు. యువా నుంచి లా అండ్ ఆర్ట్‌లో డిగ్రీ పొందిన ఘోష్ అక్కడే గిల్డ్ కౌన్సిల్ ఛైర్‌గా, సెక్రటరీగా పనిచేశారు. బ్రిటన్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ ఇన్ లా చేశారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ , వరుణ్‌ఘోష్‌కు స్వాగతం పలుకుతూ, భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్ మీరు. తొలిసారిగా ఓ వ్యక్తి సరికొత్త అధ్యాయానికి తెరతీసినప్పుడు ఆయనే చివరి వారు కాదని గుర్తుంచుకోవాలి. సెనేటర్ ఘోష్ పశ్చిమ ఆస్ట్రేలియన్ల బలమైన గొంతుకగా ఉంటారని నమ్ముతున్నా అని ఆమె పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events