Namaste NRI

ఆస్ట్రేలియా పరిశోధకులకు అద్భుత ఘనత.. ప్రపంచంలోనే

అంధులకు తిరిగి చూపు తెప్పించడంలో పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలోని మోనష్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రపంచంలోనే మొదటి బయానిక్‌ ఐని అభివృద్ధి చేశారు. గెన్నరిస్‌ బయానిక్‌ విజన్‌ సిస్టమ్‌ గా పిలుస్తున్న ఈ సాంకేతికత జంతువుల్లో విజయవంతమైంది. మనుషుల్లో విజయవంతమైతే చూపును కోల్పోయిన కోట్లాది మంది తిరిగి తమ దృష్టిని పొందవచ్చు. చికిత్స లేని అంధత్వానికి పరిష్కారం చూపడంలో ఈ సాంకేతికత విప్లవాత్మకంగా మారనుంది.

దశాబ్ద కాలంగా ఈ సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అధునాతన వ్యవస్థ సాధారణంగా కంటి నుంచి మెదడుకు దృష్టి సమాచారాన్ని చెరవేసే నేత్ర నాడులను దాటి వెళ్లడం ద్వారా పని చేస్తుంది. ఇది నేరుగా మెదడులోని దృష్టి కేంద్రానికి సంకేతాలను పంపుతుంది. దీని వల్ల వినియోగదారుడు దృశ్యాలను చూడటానికి వీలవుతుంది. గొర్రెల్లో ఈ సాంకేతికతను ఉపయోగించినప్పుడు తక్కువ ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో ఈ సాంకేతికతను మనుషులపై ప్రయోగిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events