భారత్ ఒకేరోజు కోటీకి పైగా మందికి కరోనా టీకాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. భారత్ నిజంగా అద్భుతమైన మైలురాయిని అందుకుందని బిల్ గేట్ కొనియాడారు. ప్రభుత్వం, ఆర్ అండ్ డీ కమ్యూనిటీ, వ్యాక్సిన్ తయారీదారులు, మిలియన్ల మంది ఆరోగ్య కార్యకర్తల సమిష్టి కృషి వల్ల ఈ ఘనత సాధ్యమైంది అని పీఎంఓను ట్యాగ్ చేస్తూ బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత్‌కు బిల్ గేట్స్ ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు.