Namaste NRI

వైట్ హౌజ్ ముందు ఆఫ్ఘన్ల నిరసన

ఆఫ్ఘనిస్థాన్‌ మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియలో అధ్యక్షుడు జో బైడెన్‌ సరిగా వ్యవహరించడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆఫ్గాన్‌ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని జరిగిన ప్రచారాన్ని జో బైడెన్‌ గతంలోనే తోసిపుచ్చారు. అనంతరం నెల తిరగకముందే అక్కడి నుంచి అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయడం ప్రస్తుతం అమెరికా నానా కష్టాలు పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాలోని అఫ్గాన్‌ పౌరులు కూడా వైట్‌హౌస్‌ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అఫ్గాన్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితులకు జో బైడెన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

                తాలిబన్లు మా ప్రజలను చంపుతున్నారు. అక్కడ మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. ప్రజలను చూసుకోవడానికి ఎవరూ లేరని నిరసనకారుల్లో ఒకరైన ఫర్జానా హఫీజ్‌ అన్నారు. దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ ప్రజల దీన స్థితి గురించి చెబుతూ మరో నిరసనకారుడు బోరున విలిపించాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events