Namaste NRI

ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. యూఎస్‌కు విమానాలు రద్దు!

టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్‌ కంపెనీ ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ మధ్య భారత్‌ నుంచి యూఎస్‌కు నడవాల్సిన 60 విమానాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు పేర్కొన్నాయి. పీక్‌ ట్రావెల్‌ పీరియడ్‌లో రద్దయిన విమానాల్లో ఎక్కువగా శాన్‌ ఫ్రాన్సిస్కో, చికాగో విమాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాయి. విమానాల రద్దుకు సంబంధించిన ఆయా ప్రయాణికులకు సమాచారం అందించినట్లు ఎయిర్‌లైన్‌ పేర్కొంది.

ఎయిర్ ఇండియా గ్రూప్‌ ద్వారా నడుస్తున్న ఇతర విమానాల్లో తర్వాతి రోజులకు సర్వీస్‌ని ఆఫ్ చేసినట్లు సంస్థ తెలిపింది. అయితే, ఎయిర్‌ ఇండియా మెయింటెనెన్స్‌ కోసం పంపుతున్న ఎంఆర్‌వో ఆపరేటర్‌ నుంచి విమానాలను తిరిగి పొందడంలో జాప్యం జరుగుతున్నది. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని వైడ్‌బాడీ విమానాలను సైతం నిలిచిపోయాయి. ఫలితంగా విమానాలకు కొరత ఏర్పడుతున్నది. తత్ఫలితంగా విమానా లు రద్దు చేయాల్సి వచ్చింది. విమానాల రద్దుపై ఎయిర్‌ ఇండియా విచారం వ్యక్తం చేసింది. రద్దయిన విమానా ల్లో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు సమాచారం అందించామని ఎయిర్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు విమానాలు రద్దయిన నేపథ్యంలో ఉచితంగా డేట్‌ను మార్చుకునేలా అవకాశం కల్పించడంతో పాటు పూర్తిగా టికెట్‌ డబ్బులను రీఫండ్‌ చేయనున్నట్లు పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events