Namaste NRI

అక్ష‌య్ కుమార్ సర్ఫీరా..రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం సర్ఫీరా. సుధా కొంగర ద‌ర్శ‌క‌త్వం వహిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సుధా కొంగర కాంబోలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆకాశం నీ హద్దురా. 2020 న‌వంబ‌ర్ 12న నేరుగా ఓటీటీలోకి విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ఇక ఇదే సినిమాను సుధా కొంగ‌రా హిందీలో సర్ఫీరా గా రీమేక్ చేస్తున్నారు.ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ వెల్ల‌డించా రు. ఈ సినిమాను జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా రాబోతుంది. మ‌రోవైపు ఈ సినిమా టీజ‌ర్‌ను జూన్ 20న విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events