Namaste NRI

అక్కడ ఉన్నవారంతా వెంటనే స్వదేశానికి …. కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అక్కడ ఉన్నవారంతా వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. ఒకవేళ రాలేనివారు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని తెలిపింది. భద్రత గురించి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. అత్యవసర సహాయం కోసం +963993385973, [email protected]ను సంప్రదించాలని పేర్కొన్నది. ఈ మేరకు విదేశాంగ శాఖ ట్రావెల్‌ అడ్వైజరీ జారీచేసింది.

అదేవిధంగా ప్రభుత్వ తదుపరి నోటిఫికేషన్‌ జారీచేసే వరకు భారత పౌరులెవరూ సిరియా వెళ్లొద్దని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే అక్కడ ఉంటే తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. వీలైన త్వరగా అందుబా టులో ఉన్న విమానాల్లో వచ్చేయాలని తెలిపింది. రావడం కుదరనివారు డమాస్కస్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events