అల్లరి నరేశ్ కొత్త సినిమా బచ్చల మల్లి షూటింగ్ హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. అమృత అయ్యర్ కథానాయిక. సుబ్బు మంగాదేవి దర్శకుడు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రంలో రోహిణి, కోట జయరామ్, రావు రమేశ్, సాయికుమార్, ధనరాజ్, హరితేజ ఇతర పాత్రధారులు. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాపరెడ్డి కెమెరా స్విఛాన్ చేయగా, అనిల్ రావిపూడి క్లాప్ ఇచ్చారు. విజయ్ కనకమేడల తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని దర్శకులు మారుతి, బుచ్చిబాబు మేకర్స్‌కి అందించారు. సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. ఈ సందర్భంలోనే టైటిల్‌నీ, టైటిల్ పోస్టర్‌ని కూడా ఆవిష్కరించారు. న్యూఏజ్ యాక్షన్ డ్రామాగా, 1990 నేపథ్యంలో సాగే యునిక్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నదని, శక్తిమంతమైన పాత్రను ఇందులో అల్లరినరేశ్ పోషిస్తున్నారని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్.
