Namaste NRI

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చరిత్ర సృష్టించింది. ఒక్కమాటలో చెప్పాలంటే వార్‌ వన్‌సైడ్‌గా మారింది.   మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 165 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. ఏపీ చరిత్రలోనే ఇది భారీ మెజార్టీ కాగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ విజయంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం తదితర అంశాలపై చర్చించారు.

 పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ 25 నియోజకవర్గాలకు ఏకంగా 21 సీట్లను కూటమి కైవసం చేసుకున్నది. టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాలు గెలుచుకున్నాయి. పోలీసులు చంద్రబాబు ఇల్లు, టీడీపీ కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. కాన్వాయ్‌ని సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లి ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events