Namaste NRI

చంచ‌ల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుద‌ల‌

టాలీవుడ్ న‌టుడు అల్లు అర్జున్  చంచ‌ల్‌గూడ జైలు నుంచి శ‌నివారం ఉద‌యం 6.40 గంట‌ల‌కు విడుద‌ల‌ య్యారు. ఈ మేర‌కు చంచ‌ల్ గూడ జైలు అధికారులు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాల‌యానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. మ‌రికాసేప‌ట్లో అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసా నికి చేరుకోనున్నారు. ఇక అల్లు అర్జున్ నివాసం వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇక జైలు వెనుక గేటు నుంచి అర్జున్‌ను అధికారులు బ‌య‌ట‌కు పంపించారు. గీతా ఆర్ట్స్ కార్యాల‌యం వ‌ర‌కు పోలీసు ఎస్కార్ట్‌తో అల్లు అర్జున్ చేరుకున్నారు.

ఇక సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించ‌ డంతో నిన్న చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, నాలుగు వారాల పాటు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయ‌వాదులు రూ. 50 వేల పూచీక‌త్తును జైలు సూప‌రింటెండెంట్‌కు స‌మ‌ర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులు శుక్ర‌వారం రాత్రి ఆల‌స్యంగా అందాయి. దీంతో ఆయ‌న రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వ‌చ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events