అమెరికాలో మరో భారత యువకుడు మరణించాడు. కాలిఫోర్నియాలోని ప్రముఖ గ్లేసియర్ పార్కులో నీట మునిగి ఐటీ ఉద్యోగి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలో పనిచేస్తున్న 26 ఏండ్ల సిద్ధాంత్ విఠల్ పాటిల్ జూన్ 6న తన స్నేహితులతో కలిసి మోంటన్నా రాష్ట్రంలోని ఈ పార్కులో ప్రమాదానికి గురయ్యాడు. అవలాంచ్ లేక్ ట్రయల్‌లో కొండగట్టుపైన హైకింగ్ చేస్తుండగా, అతను పెద్ద రాయి నుంచి పక్కనే ఉన్న చిన్న హిమానీనదంలో పడిపోయాడు. అయితే రాయి నుంచి జారిపడ్డాడా, లేక బ్యాలెన్స్ తప్పి పడిపోయాడా అన్నది నిర్ధారణ కాలేదు. అతని మృతదేహం కోసం అధికారులు హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపట్టారు. అయితే నీటిలో దిగువకు కొట్టుకు వచ్చిన అతని వస్తువులు కొన్నింటిని స్వాధీనం చేసుకు న్నారు. రాళ్లు, చెట్ల మధ్య అతని మృతదేహం ఇరుక్కుని ఉండవచ్చునని వారు అనుమానం వ్యక్తం చేశారు.