తెలంగాణ రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కేరళకు చెందిన కైటెక్స్ గ్రూపు ముందుకొచ్చింది. దాదాపు రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలపై కైటెక్స్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ సాయిబాబు, ప్రతినిధుల బృందం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమై చర్చించారు. దుస్తుల తయారీ రంగంలో పేరొందిన కైటెక్స్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశ్రమలను నిర్వహిస్తోంది. పారిశ్రామిక అనుకూల విధానాలు, టెక్స్ టైల్ రంగంలో అపార అవకాశాలు ఉన్నందునే తెలంగాణను ఎంచుకున్నట్లు ఎండీ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 30 వేల ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్లు అంచనా.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కౖెెటెక్స్ గ్రూపు చైర్మన్, ఎండీ సాబ్ ఎం జాకబ్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హ్యాండ్లూమ్స్, టైక్స్‌టైల్స్ కమిషనర్ శైలజా రామయ్యర్, టీఎస్‌ఐఐసీ లిమిటెడ్ ఎండీ నర్సింహారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.