జనవరి 20న బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో పన్నుల భారానికి సిద్ధమయ్యారు. దేశంలోకి దిగుమతవుతున్న విదేశీ వాహనాలపై కూడా పన్నులు పెంచాలనుకుంటున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 2 నుంచి వాహనాలపై కూడా సుంకాలు విధించనున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ టారిఫ్ల గురించి ఆయన అదనపు సమాచారం ఇవ్వకపోయినా మార్చి 12 నుంచి అమలు చేస్తామని ప్రకటించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల టారిఫ్ల మాదిరిగానే
