Namaste NRI

విడాకులకు సిద్ధంగా మరో సినీ జంట

హాలీవుడ్ న‌టుడు బెన్ అఫ్లెక్ నుంచి విడాకులు తీసుకునేందుకు జెన్నిఫ‌ర్ లోపేజ్ దర‌ఖాస్తు చేసుకున్న‌ది. రెండు ఏళ్ల వివాహ బంధానికి ఆ ఇద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ కోర్టులో  జెన్నిఫ‌ర్ లోపేజ్ డైవ‌ర్స్ ఫైల్ చేసింది. 2022లో ఆ ఇద్ద‌రూ లాస్ వెగాస్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత జార్జియాలో భారీ విందును ఏర్పాటు చేశారు. వాస్త‌వానికి ఇద్ద‌రి మ‌ధ్య 2002లోనే ప‌రిచ‌యం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఒక్క‌ట‌వ్వాల‌ని నిర్ణ‌యించారు. కానీ రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు.

లాస్ ఏంజిల్స్ కోర్టు డాక్యుమెంట్ల ప్ర‌కారం లోపేజ్‌, అఫ్లెక్ ఇద్ద‌రూ త‌మ ఆర్థిక స‌మాచారాన్ని వెల్ల‌డించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుత ఆదాయం, ఖ‌ర్చులు, ప్రాప‌ర్టీలు, రుణాలు, ఏమున్నాయో చెప్పాల్సి ఉంటుంది. తుది ఒప్పందం జ‌రిగే వ‌ర‌కు ఇద్ద‌రూ త‌మ ఆర్థిక వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేయాల్సి ఉంటుంద‌ని కోర్టు డాక్యుమెంట్లు పేర్కొన్నాయి. 60 రోజుల్లో లోపేజ్ త‌న ఆదాయ, ఆర్థిక వివ‌రాల‌ను వెల్ల‌డించాలి. ఆ త‌ర్వాత మ‌రో 60 రోజుల్లో అఫ్లెక్ కూడా త‌న ఆర్థిక వివ‌రాలు తెలుపాల్సి ఉంటుంది. ఒక‌వేళ త‌మ ఆర్థిక‌ వివ‌రాలు తెలుప‌క‌పోతే, అప్పుడు కోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events