ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా)-2024 వేడుక అబుదాబిలో వైభవంగా జరుగుతున్న ది. ఈ కార్యక్రమంలో వివిధ భాషలకు చెందిన అగ్ర తారలు సందడి చేశారు. ఈ వేడుకలో అగ్ర నటుడు చిరంజీవి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకున్నారు. ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని గెలుచుకున్నారు. అగ్రనటుడు బాలకృష్ణ గోల్డెన్ లెగసీ అవార్డును అందుకున్నారు. ఉమెన్ ఆఫ్‌ది ఇయర్‌గా సమంత అవార్డును స్వీకరించింది.
ఐఫా అవార్డుల విజేతలు :
ఉత్తమ తెలుగు చిత్రం: దసరా
ఉత్తమ నటుడు: నాని
ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)
ఉత్తమ తమిళ చిత్రం: జైలర్
ఉత్తమ తమిళ నటుడు: విక్రమ్ (పొన్నియన్ సెల్వన్)
ఉత్తమ తమిళ నటి: ఐశ్వర్యారాయ్ (పొన్నియన్ సెల్వన్)
ఉత్తమ తమిళ దర్శకుడు: మణిరత్నం (పొన్నియన్ సెల్వన్).