ప్రపంచానికి బుల్లెట్ రైలును పరిచయం చేసిన జపాన్, మరో అద్భుత ఆవిష్కరణకు పూనుకుంది. రాజధాని టోక్యో నుంచి ఒసాకా వరకు 515 కిలోమీటర్ల (320 మైళ్లు) మేర సరికొత్త సరుకు రవాణా వ్యవస్థను జపాన్ తీసుకొస్తున్నది. ఇంతకు ముందు ఎక్కడా చూడనటువంటి రీతిలో ఓ ఆటోమేటెడ్ కార్గో ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (కన్వేయర్ బెల్ట్ రోడ్)ను నిర్మించబోతున్నది. సాంకేతికంగా ప్రపంచ దేశాలేవీ అందుకోలేనంత స్థాయిలో దీని నిర్మాణం ఉంటుందట. జపాన్ నిర్మిస్తున్న ఈ కారిడార్‌ను ఆటో ఫ్లో రోడ్‌గా కూడా పిలుస్తున్నారు. ఈ కారిడార్ ప్రతిరోజూ 25,000 ట్రక్ డ్రైవర్ల పనిని చేస్తుందని అధికారులు చెబుతున్నారు.