Namaste NRI

మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క

లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో మెప్పించడంలో అగ్ర కథానాయిక అనుష్కది పెట్టింది పేరు. ఈ అమ్మడు కొత్తగా మరో మహిళా ప్రధాన చిత్రానికి సంతకం చేసింది. దీన్ని దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజా గా ఈ సినిమా షూటింగ్‌ కోసం అనుష్క ఒడిశాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమెకు లభించిన స్వాగతానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఓ అగ్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నదని సమాచారం. ఇందులో రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని తెలిసింది. మిగతా నటీ నటుల గురించి తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress