Namaste NRI

జవాను కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల సాయం

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు జశ్వంత్‌ రెడ్డి (23) వీరమరణం పొందడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్‌లో ప్రాణ త్యాగం చేసిన జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని జగన్‌ అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. మన జవాన్‌ చూసిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.

   జమ్ముకశ్మీర్‌లోని సుందర్‌బాని సెక్టార్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో జశ్వంత్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచే ప్రభుత్వం సాయాన్ని ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events