టెక్ దిగ్గజం, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మస్క్ గురించి 31 ఏళ్ల రచయిత్రి యాష్లే సెయింట్ క్లెయిర్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఐదు నెలల క్రితం మస్క్ బిడ్డకు తాను జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా సంచలన ప్రకటన చేసింది. ఐదు నెలల క్రితం నేను ఓ బిడ్డకు జన్మనిచ్చాను. ఆ బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి. బిడ్డ గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకూ నేను ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆ విషయాన్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకే నేనే వెల్లడించాలనుకున్నా. మా బిడ్డ సురక్షిత వాతావరణంలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా అని పేర్కొన్నారు.
