ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అట్లాంటాలో ప్రతిష్ఠాత్మక గాంధీ పీస్ పిలిగ్రిమ్ పురస్కారం అందుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, అమెరికా పౌర హక్కుల ఉద్యమ నేత డా.మార్టిన్ లూథర్ కింగ్‌లు ప్రబోధించిన శాంతి, అహింసా సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరుగని కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. మార్టిన్ లూథర్ కింగ్ అల్లుడు ఇసాక్ ఫెర్రీస్, అట్లాంటాలో భారత కాన్సుల్ జనరల్ డా.స్వాతి కులకర్ణి సమక్షంలో అమెరికాలోని గాంధీ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని శ్రీశ్రీ రవిశంకఱ్‌కు అందజేసింది.
