అల్లరి నరేశ్ హీరోగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బచ్చలమల్లి. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లరి నరేశ్ మాట్లాడారు. దర్శకుడు సుబ్బు మూడేళ్లు కేవలం ఈ సినిమాతోనే జర్నీ చేశారు. అదినాకు చాలా నచ్చింది. కథ ఎంత అద్భుతంగా చెప్పారో, అంతకంటే అద్భుతంగా తీశారు. టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందరం కలిసి ఓ టీమ్ ఎఫర్ట్‌గా పనిచేశాం. నా కెరీర్‌లో నాంది లా ఈ సినిమా కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది అని అన్నారు.
కరోనా టైమ్‌లో అమ్మను చూడ్డానికి హాస్పిటల్‌కి సరైన సమయంలో వెళ్లలేకపోయా. తీరా వెళ్లే సరికి అదే చివరి చూపు అయ్యింది. జీవితాన్ని తేలిగ్గా తీసుకోకూడదని అప్పుడర్థమైంది. వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పు చేయకూడదని అప్పుడు తెలిసింది. ఇలాంటి పాయింట్‌తో నిజాయితీగా ఓ కథ చెప్పాలనిపించింది. అదే ఈ బచ్చలమల్లి అని దర్శకుడు చెప్పారు. ఇష్టంతో కష్టపడి, ప్రేమించి చేసిన సినిమా ఇది. డిసెంబర్ 20న వస్తున్నాం. హిట్ కొడుతున్నాం, రాసిపెట్టుకోండి అని నిర్మాత రాజేష్ దండా నమ్మకంగా చెప్పారు. ఇంకా కథానాయిక అమృతా అయ్యర్, నటుడు ప్రసాద్ బెహరా, డీవోపీ రిచర్డ్, ఎడిటర్ చోటా కె.ప్రసాద్, కళాదర్శకు డు బ్రహ్మకడలి కూడా మాట్లాడారు.