నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ చిన్ని అంటూ సాగే వినసొంపైన పాటను రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్, థమన్ సంగీతం హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదలవుతోంది.