నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ అభిమానులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బండ్లగణేష్ పవన్ కల్యాణ్ కు వీరభిమాని. పవన్ కల్యాణ్ కు ఇటీవల దేవర అనే పేరు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు బండ్ల గణేష్. తన ట్విట్టర్ ఖాతాను త్వరలోనే తొలగిస్తానని, ట్విట్టర్ కి గుడ్ బై చెప్పేస్తా అంటూ తెలిపారు. నో కాంట్రవర్సీస్ నా లైఫ్‌లో అలాంటి వాటికి చోటు లేదు అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బండ్ల గణేష్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది.