భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వడంపట్ల పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన పీవీ జయంతి శతాబ్ది ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించి పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు 28 జూన్, 2021న విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఉత్సవా లకు సహకరించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని ఎన్నారైలు అందరు సంతోషం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పీవీకి భారతరత్నను సాధించే దిశగా ఏకంగా ఆన్‌లైన్‌లో ఓ పెద్ద ఉద్యమాన్నే మొదలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.