Namaste NRI

తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ వామిక

సక్సెస్‌ఫుల్‌ స్పైథ్రిల్లర్‌ గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం జీ2. అడవి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి వామికా గబ్బి భాగమైం ది. ఇటీవలే అడివి శేష్‌తో కలిసి యూరోప్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న వామికా ఈ సినిమా గురించి మాట్లాడు తూ సరికొత్త స్పైథ్రిల్లర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర సవాలుతో కూడుకొని ఉంటుంది. తెలుగులో ఈ సినిమా నాకు మంచి బ్రేక్‌ నిస్తుందనే నమ్మకం ఉంది అని చెప్పింది. ఇమ్రాన్‌హష్మీ, మురళీశర్మ, సుప్రియా యార్లగడ్డ, మధుషాలిని తదితరులు నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress