న్యూజిలాండ్‌లో తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాపకుర గణేశ్ ఆలయంలో పండుగను నిర్వహించారు. ప్రవాసీయులు సంప్రదాయబద్ధంగా బోనాన్ని మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా డోలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆ దేశ కేబినెట్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్, పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ పాల్గొన్నారు. బోనాల కార్యక్రమానికి హాజరైన మంత్రి ప్రియాంకకు తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. కల్యాణ్ రావు ఆధ్వర్యంలో కోర్ కమిటీ సభ్యులు రామ్మోహన్ దంతాల, స్వాతి పయ్యరకార, కిరణ్ పోకల, లక్ష్మణ్ కలకుంట్ల, అశుతోష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది వరకు తరలివచ్చి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.
