బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రభుత్వ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు మంత్రులు తమ కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కల్యాణ వేడుకను నిర్వహించారు.