ధనుష్ హీరో గా స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడు. ఇటీవలే D50 షూటింగ్ షురూ అయింది. ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తూ, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. ధనుష్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు ఇన్‌సైడ్ టాక్. కాగా ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. D50లో బుట్టబొమ్మ ఫేం అనిఖా సురేంద్రన్ హీరోయిన్‌గా నటించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అనిఖా సురేంద్రన్ తక్కువ టైంలోనే ధనుష్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మరి అనిఖా సురేంద్రన్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నది తెలియాల్సి ఉంది.