హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా,
భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఈ భేటీలో ధన్కడ్కు దత్తాత్రేయ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బహుకరించారు.
దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐ ఎన్ ఎస్ విక్రాంత్ ను ప్రధాని నరేంద్ర మోది నౌకాదళంలో ప్రవేశపెట్టారు. నౌకా దళానికి సరికొత్త గుర్తు ను కూడా ఆవిష్కరించారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్ ఇంట్లో మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమతో అట్లాంటా, జార్జియా లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం.
శంషాబాద్ లో నోవాటేల్ హోటల్ లో భారత మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు