Namaste NRI

భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేకు పరమ విశిష్ట సేవా పతకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి అందుకున్నారు. జనరల్ మనోజ్ పాండే ఏప్రిల్ 30న భారత 29వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ సందర్శనకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులు చంచల్‌గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. వీరిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, భట్టి విక్రమార్క ములాఖత్‌లో కలిసి పరామర్శించారు.

ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌లో తన మూడు దేశాల పర్యటన సందర్భంగా మొదటగా బెర్లిన్‌ బ్రాండెన్‌బర్గ్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి భారత సంతతికి చెందిన ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు.

భార‌త ఆర్మీ చీఫ్‌గా జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మూడేళ్ల పాటు పాండే ఈ ప‌ద‌విలో కొన‌సాగనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్‌గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే.