రష్యా మే 9వ తేదీన విక్టరీ డే పరేడ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మాస్కోలో విక్టరీ డే పరేడ్ రిహార్సల్స్ జరిగాయి.
వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ లో కై టెక్స్ పార్క్ వస్త్రా పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
డీఎంకే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అయిన సందర్భంగా తమినాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆర్టీసీ బస్సు లో ప్రయాణించి మహిళలకు కల్పించిన ఉచిత బస్ సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి రోజా లోటస్ పాండ్‌లో వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిశారు. ఈ సందర్భంగా రోజాను విజయమ్మ అభినందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌లో తన మూడు దేశాల పర్యటన సందర్భంగా మొదటగా బెర్లిన్ బ్రాండెన్‌బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి భారత సంతతికి చెందిన ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్‌లోని కొత్తపేట వాసవి కాలనీలోని అష్టలక్ష్మీ దేవాలయ 26వ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి.
భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పాండే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకూ జనరల్ మనోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
ఢల్లీిలోని విజ్ఞాన్ భవన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సును ప్రారంభమైంది.
నల్గొండ టౌన్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు చిరు శాలువా కప్పి సన్మానించారు.