అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) ప్రారంభోత్సవంలో సుప్రీం కోర్టు సీజే జస్టీస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్
రామప్ప ఆలయంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర దంపతులు.
గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన్నజీయర్ స్వామీ, రామజన్మభూమి ట్రస్ట్ కోశాధికారి గోవింద్‌గిరి మహారాజ్ హాజరయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి స్టాలిన్ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు.. ఆయన పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.
పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఫోటో ఎక్సిబిషన్ కార్యక్రమం లో పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు , తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మొహమ్మద్ అలి తదితరులు
RRR మూవీ ప్రచారం లో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న చిత్ర యూనిట్ ,దర్శక ధీరుడు రాజమౌళి,రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, నిర్మాత డివివి దానయ్య
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి, శ్రీనివాసప్రసాద్ ల కుమార్తె విశాలను పెళ్లికుమార్తెను చేసే వేడుక మాదాపూర్లోని ఓ హోటల్లో జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు హాజరై పెళ్లికుమార్తైను ఆశీర్వదించారు. చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలాకాలం తర్వాత ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తనయుడు హర్షవర్ధన్, రాధ దంపతుల కుమార్తె నిహారిక, హైదరాబాద్కు చెందిన చుండూరు వెంకట లక్ష్మణరావు, మాధురీ దేవి దంపతుల కుమారుడు రవితేజల వివాహం శంషాబాద్ విమానాశ్రయం జీఎమ్మార్ ఎరీనాలో వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.