9/11 ఉగ్రదాడి మృతులకు యావత్ అమెరికా నివాళి అర్పించింది. పెన్సిల్వేనియాలోని శాంక్స్విల్లే వద్ద నివాళి కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ దంపతులతోపాటు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఒరాక్ ఒబామా దంపతులు పాల్గొన్నారు.
మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తో కలిసి ప్రారంభించిన కేటీఆర్, సబిత ఇంద్రా రెడ్డి
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. గణపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ ఘనంగా స్వాగతం పలికారు.
కోవిడ్ సంక్షోభంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు బ్యాంకర్లకు సీఎం శ్రీ వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, MSMEలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరారు.