కుక్కల కంటే పిల్లులకే కరోనా వైరస్ సోకే ప్రమాదం అధికమని తాజా అధ్యయనంలో తేలింది. న్యూయార్క్‌కు చెందిన వెటర్నరీ, బయోమెడికల్ పరిశోధకుడు డాక్టర్ హిన్హ్ లీ, ఆయన భార్య యూయింగ్ లియాంగ్ ఈ పరిశోధనకు సారథ్యం వహించారు. ఇందులో భాగంగా కుక్కలు, పిల్లులకు యాంటిబాడీ పరీక్షలు నిర్వహించారు. పిల్లుల్లో కంటే కుక్కల్లో కరోనా వైరస్‌ను నిరోధించే ప్రతిరక్షకాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే పిల్లులకు కరోనా సోకినప్పటికీ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా వైరస్ సోకిన కుక్కలు, పిల్లుల వల్ల మనుషులకు ముప్పు ఉందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.