Namaste NRI

మిస్ ఇండియా యూఎస్ఏగా చెన్నై భామ

మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024 కిరీటాన్ని ఇండియన్‌ అమెరికన్‌ టీనేజర్‌ కెయిట్లిన్‌ శాండ్రా నెయిల్‌ (19)  కైవసం చేసుకున్నారు. మిస్ట్రెస్‌ ఇండియా యూఎస్‌ఏగా సంస్కృతి శర్మ (ఇల్లినాయిస్‌), మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్‌ఏగా అర్షిత కట్పలియా (వాషింగ్టన్‌) ఎంపికయ్యారు. మిస్‌ ఇండియా యూఎస్‌ఏ పోటీలో ఫస్ట్‌ రన్నరప్‌గా నిరాలి దేసియా, సెకండ్‌ రన్నరప్‌గా మానిని పటేల్‌ నిలిచారు. మిస్ట్రెస్‌ ఇండియా యూఎస్‌ఏ పోటీలో ఫస్ట్‌ రన్నరప్‌గా సప్నా మిశ్రా, సెకండ్‌ రన్నరప్‌గా చిన్మయీ ఆయాచిత్‌ నిలిచారు. టీన్‌ కేటగిరీలో ఫస్ట్‌ రన్నరప్‌గా ధ్రుతి పటేల్‌, సెకండ్‌ రన్నరప్‌గా సోనాలి శర్మ నిలిచారు. ఇండియా ఫెస్టివల్‌ కమిటీ న్యూజెర్సీలో నిర్వహించిన ఈ పోటీల్లో 25 రాష్ర్టాల నుంచి 47 మంది పాల్గొన్నారు.

19 ఏళ్ల శాండ్రా   తమిళనాడులోని చెన్నైలో పుట్టారు.ప్రస్తుతం డేవిస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో సెకండియర్ చదువుతున్నారు. తన కమ్యూనిటీపై సానుకూల శాశ్వత ప్రభావాన్ని చూపాలని అనుకుంటు న్నాన ని, మహిళా సాధికారత, అక్షరాస్యతపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని శాండ్రా వెల్లడించారు.ఆమె దాదాపు 14 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తుండగా.  వెబ్ డిజైనర్  కావాలన్నది సాండ్రా కల.దీనితో పాటు మోడలింగ్, నటిగానూ రాణించాలని అనుకుంటున్నట్లు శాండ్రా  తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events