తెలంగాణలో ‘ఉద్యోగ పర్వానికి’ తెర లేపారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 50,000 ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను కోరారు. అయితే ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను మాత్రం రెండో దశలో భర్తీ చేయాలని కేసీఆర్ సూచించారు. పూర్తి సమాచారంతో నివేదికను సిద్ధం చేయాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.