తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. ఓట్ల లిస్టులో కేసీఆర్ సీరియల్ నెంబర్ 158గా ఉంది. ఓటరు కార్డు సంఖ్య SAG 0399691గా ఉంది. సీఎం సతీమణి శోభమ్మ సీరియల్ నంబర్ 159, ఓటరు కార్డు నంబర్ SAG 0761676గా ఉంది. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్. సీఎం దంపతులు చింతమడకకు వెళ్తుండటంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
