Namaste NRI

అమెరికా యూట్యూబర్‌ తల్లిపై ఫిర్యాదు… ఆమె మమ్మల్ని

అమెరికాకు చెందిన టీనేజ్‌ యూట్యూబర్‌ పైపర్‌ రాకెల్లే (15) తల్లి టిఫానీ స్మిత్‌ తమను లైంగికంగా వేధించారని 11 మంది టీనేజ్‌ పిల్లలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2022 జనవరిలో లాస్‌ ఏంజిల్స్‌ కౌంటీ టాప్‌ కోర్టులో వాళ్లు లా సూట్‌ ఫైల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్‌ 17న విచారణకు రాగా,  తదుపరి విచారణ ఈ ఏడాది నవంబర్‌ నెలకు వాయిదాపడింది. పైపర్‌ రాకెల్లే తన టాలెంట్‌తో యూట్యూబ్‌లో స్టార్‌గా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె తనతోపాటు మరికొందరు టీనేజర్‌లను తన టీమ్‌లో చేర్చుకుని పెద్ద స్క్వాడ్‌ను ఏర్పాటు చేసుకుంది. వారి వీడియోలు క్రియేట్‌ చేయడంలో పైపర్‌ తల్లి టిఫానీ సూచనలు, సలహాలు ఇస్తుండేది. టిఫానీ బాయ్‌ఫ్రెండ్‌ కంటెంట్‌ను ఎడిట్‌ చేసేవాడు.

అయితే, వీడియోలు క్రియేట్‌ చేసే టైమ్‌లో టిఫానీ తమతో అసభ్యంగా ప్రవర్తించేవారని పైపర్‌ స్క్వాడ్‌ నుంచి బయటికి వచ్చిన 11 మంది టీనేజర్‌లు ఆరోపిస్తున్నారు. ఆమె 2017 నుంచి 2020 వరకు తమను లైంగికంగా, శారీరకంగా, ఉద్వేగపరంగా వేధింపులకు గురిచేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె అసభ్యంగా తమ కాళ్లను తాకేదని, తొడలు, పిరుదులపై చేతులు వేసేదని తెలిపారు. వేధింపులు తాళలేక పైపర్‌ రాకెల్లే స్క్వాడ్‌ నుంచి తాము బయటికి వచ్చామని, తాము పైపర్‌తో చేసిన వీడియోలకు సంబంధించి మనిషికి 20 లక్షల డాలర్ల చొప్పున ఇప్పించాలని కోర్టును కోరారు. కాగా, ఈ ఆరోపణలను పైపర్‌ తల్లి టిఫానీ కొట్టిపారేశారు. తన నుంచి డబ్బు గుంజడానికే ఆ టీనేజర్స్‌ తల్లులు తనపై తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events