సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దర్జా. కామినేని శ్రీనివాస్ సమర్పణలో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఆమని, పృథ్వి, ఆక్సాఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో హీరో వెంకటేష్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది. రిచ్‌గా తెరకెక్కించారు. పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. సహా నిర్మాత రవి పైడిపాటి మాట్లాడుతూ ఇదొక వినూత్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, నిర్మాత పైడిపాటి శివశంకర్, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటితో పాటు చిత్ర దర్శకుడు సలీం మాలిక్, సంగీత దర్శకులు రాపక్ర్ షకీల్, కెమెరామెన్ దర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సంగీతం: రాప్ రాక్ షకీల్, ఛాయాగ్రహణం :దర్శన్.
