Namaste NRI

తెలంగాణలో మంత్రులకు కేటాయించిన శాఖలివే..

తెలంగాణ క్యాబినేట్‌లో కొత్తగా కొలువుదీరిన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపు కోసం హస్తిన వెళ్లిన ఆయన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్‌లతో చర్చలు జరిపినంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన హోంశాఖ, సాధారణ పరిపాలన,మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ శాఖలతో పాటు కేటాయించని శాఖలు తనవద్దే ఉంచుకున్నారు. 11 మంది మంత్రులకు వివిధ శాఖలు అప్పగించారు.

మంత్రులు- శాఖలు

భట్టివిక్రమార్క- ఆర్థిక, విద్యుత్‌ శాఖ

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి- నీటిపారుదల, పౌరసరఫరాలు

శ్రీధర్‌బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు

దామోదర రాజనర్సింహ- వైద్య, ఆరోగ్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి- రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ

తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం, చేనేత శాఖ

జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్‌, పర్యాటక శాఖ

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి- రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ

పొన్నం ప్రభాకర్‌- రవాణా, బీసీ సంక్షేమం

సీతక్క- మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్‌

కొండా సురేఖ- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress